Home Health మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. ఎలాగో మీకు తెలుసా ?
Health - May 22, 2019

మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. ఎలాగో మీకు తెలుసా ?

సాధారణంగా మనం బీపీ వంటి పరీక్షలు చేయుంచుకోటానికి క్లినిక్ కి వెళ్తాము. లేదా బీపీ ఆపరేటస్ తో ఇ౦ట్లోనే చెక్ చేసుకు౦టా౦ . కానీ ఆటోమేషన్ విప్ల‌వ౦లో  ఎటువంటి పరీక్షలు అవసరం లేకుండా మనకు సంబందించిన పల్స్ రేట్, బీపీ, టెంపరేచర్, ఆక్సిజెన్ నిల్వలు మొదలైన వాటిని తెలిపే అల్గారిథమ్స్ ను చెన్నై ఐఐటీకి చెందిన ప్రోఫెసర్ మణివణ్ణన్ నేతృత్వం లో బృందం అభివృద్ధి చేసింది.  ఈ అల్గారిథమ్స్ ను ఉపయోగించి రూపొందించిన విన్ సెన్స్ అనే వాచీలాంటి పరికరాన్ని మెడిలోటెక్ అనే కంపెనీ రూపొందించింది. ఈ పరికరం ద్వారా సేకరించిన సమాచారాన్ని క్లౌడ్ ద్వారా సమీకరించి నిక్షిప్తం చేస్తారు. ఈ తరహా అల్గారిథమ్స్ ను రూపొందించడం మన దేశం లో ఇదే తొలిసారి. ఇప్పటిదాకా వివిధ పరికరాల్లో వాడిన అల్గారిథమ్స్ అన్ని ఇతర దేశాల‌ శాస్త్రవేత్తలు రూపొందించినవే!  పరీక్షల ద్వారా మన శరీరానికి సంబందించిన సమాచారాన్ని తెలుసుకోవడమే పాత పద్ధతి. శరీరానికి అమర్చిన పరికరాల ద్వారా మనకు సంబందించిన ముఖ్యమైన సమాచారమంతా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అన్నది కొత్త పద్ధతి. దీని వెనుక చాల టెక్నాలజీ నిక్షిప్తమై  ఉంది. ఈ టెక్నాలజీ కి అవసరమైన అల్గారిథమ్స్ ని  ప్రోఫెసర్ మణివణ్ణన్  టీమ్ రూపొ౦ది౦చారు .

ఇటీవల కాలం లో ఆరోగ్య రంగం లో సాంకేతిక పరిజ్ఞానం కీలకమైన పాత్ర పోషిస్తుంది. ‘మనం ఆరోగ్యం లో ఖర్చుపెట్టే 10 శాతం టెక్నాలజీ పై ఖర్చు పెడితే అద్భుతాలు సృష్టించవచ్చు.  ఇది జరిగితే ఆరోగ్య సేవల విషయం లో మనం ప్రపంచం లో అగ్రగామిగా నిలుస్తాం . ఆరోగ్య సేవలకు సంబందించిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెయ్యడానికి  ఐఐటీ మద్రాసు లో ‘టచ్’ అనే ఒక పరిశోధనాశాలను నెలకొల్పారు . ప్రపంచవ్యాప్తం గా మొబైల్స్ లేదా శరీరానికి అమర్చుకుని వివిధ పరికరాల ద్వారా ఆరోగ్య అ౦శాలను తెలుసుకోవడం సామాన్యమైపోయింది.  ఫిట్ బిట్ వంటి పరికరాలు పల్స్ రేట్ , బీ పీ , గుండె కొట్టుకుంటున్న వేగం మొదలైన విషయాలను చెబుతున్నాయి. రకరకాల హెల్త్ అప్లికేషన్ల ద్వారా ఎంతో దూరం నడిచాం… ఎన్ని గంటలు నిద్రాపోయాం అన్న విషయాలను కూడా  తెలుసుకు౦టున్నా౦  అయితే ఇవన్ని ఏకకాల౦లో పనిచేసే విధ౦గా, ఒకే చోట స్టోర్ అయ్యే విధ౦గా అల్గారిథ౦ తయారుచేయట౦ చెన్నై ఐఐటీకి చెందిన ప్రోఫెసర్ మణివణ్ణన్ నేతృత్వం లో బృందానికే చెల్లి౦ది. ఇది పూర్తి దేశీయ పరిజ్ఞాన౦తో అభివృద్ది చేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ వీడియో మీరు 5 సెకండ్స్ కంటే మించి చూడలేరు

ఈ వీడియో మీరు 5 సెకండ్స్ కంటే మించి చూడలేరు …